భాష


అమెరికాలో పుట్టి పెరిగినా, అవధానాలు చేసే తరం ఇప్పుడు ఉంది.
రష్యాలో పుట్టి పెరిగినా, తెలుగు సినిమా పాటలకు షార్ట్ వీడియోస్ చేసే తరం ఒకటుంది.
మలేసియాలో పుట్టి పెరిగినా, దాటు భజనలు, చిరతలు ఆడుతున్న తరం ఇక్కడ ఉంది.
శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో, బర్మాలలో పుట్టి పెరిగి తెలుగు బడులకు వెళ్తున్న తరం కూడా ఇది.
ఇప్పుడు ప్రపంచంలో ప్రతిదేశమూ తనదైన ఒక తెలుగు కథ చెబుతుంది. అందుకే తెలుగు గురించి కానీ, తెలుగు విశేషాలను గురించి మాట్లాడేటప్పుడు ఏ ఒక్క ప్రాంతానికో లేదా ఒక్క జాతికో ముడి పెట్టకూడదని మా ఆలోచన. మా దృష్టిలో -
🗣️ తెలుగు భాషలో మాట్లాడి,
📖 తెలుగు సాహిత్యపు సొగసులు తెలిసీ,
🎶 తెలుగు కళల మీద పట్టున్న
ఎవరైనా తెలుగువాడే,తెలుగు వాళ్ళున్న ఏ ప్రాంతమైనా తెలుగు నేలే.
అందుకే మనం తెలుగు చర్చ నుంచి కాస్త ముందుకు వెళ్ళి ఏది తెలుగు భాష, ఏది తెలుగు సాహిత్యం, ఏది తెలుగు సంస్కృతి అన్నది అలోచిద్దాం.