పలుకుబడి

తెలుగు పలుకుబడిలో మొదటి నుంచి సంస్కృత పెత్తనమే ఎక్కువ, తెలుగు పాళ్లు తక్కువే. అలా అని క్రుంగవలసినక్కఱలేదు.

పొనగంటి తెలగన్న, పాల్కురికి సోమనాధుడు, కూచిమంచి తిమ్మకవి లాంటి వ్రాయికర్లు పూర్తీగా తెలుగులోనే తమ అల్లికలు సాగించారు. తెలుగు నూఱాదిల్లో వేమన నూఱాది, సుమతీ నూఱాదిల్లో తెలుగుకు చక్కని తావే దొరికింది. తిక్కన, పోతన లాంటి కవులు తమ అల్లికల్లో తెలుగును మంచిగానే వాడినారు.

అన్నమయ్య పాటల్లో రాయలసీమ తెలుగును బాగా చూడవచ్చు. ఆదిభట్ల నారాయణదాసు, మారేపల్లి రామచంద్రశాస్త్రి లాంటివారు సంస్కృతంలో ఉన్న కొల్వ వ్రాయాదినంతా తెలుగులోకి మార్చారు.

ఇవేకాక మన జానపదాలు అంతా పోతపోసిన తెలుగు. ఇదంతా కూడా మేలిమి పలుకుబడినే.

మన మేలిమి తెలుగు పొత్తపిల్లులో తెలుగు పుస్తకాలు బాగానే ఉన్నాయి. మీకు నచ్చిన పుస్తకం కోసం మేలిమి తెలుగు పొత్తపిల్లు చూడండి.